నియంత్రణ కలిగి ఉండండి

మీరు మీ గోప్యతను నిర్వహించడానికి నియంత్రణలను కలిగి ఉన్నారు.

మేము మా సేవలను వీలైనంత ఉపయోగకరంగా ఉండేలా చేయడానికి డేటాను ఉపయోగిస్తాము, కానీ మేము సేకరించే మరియు ఉపయోగించే డేటా రకాలను నిర్ణయించండి. మీ గోప్యత మరియు భద్రతను నిర్వహించడంలో మీకు సహాయపడే సులభ వినియోగ సాధనాలకు శీఘ్ర ప్రాప్యతను అందించడానికి మేము నా ఖాతాను రూపొందించాము. మీరు కింది సెట్టింగ్‌లను సమీక్షించడం ద్వారా మీ డేటా మీ కోసం Google సేవలు మెరుగ్గా పని చేసేలా ఎలా చేయగలదో నిర్ణయించండి.

నా ఖాతాకు వెళ్లు

గోప్యతా పరిశీలనతో మీ గోప్యతా సెట్టింగ్‌లను నిర్వహించండి

కేవలం కొద్ది నిమిషాల్లో, మీరు Google సేకరించే డేటా రకాలను నిర్వహించగలరు, మీరు స్నేహితులతో భాగస్వామ్యం చేసే లేదా పబ్లిక్‌గా ఉంచే వ్యక్తిగత సమాచారాన్ని నవీకరించగలరు మరియు మీకు Google చూపాలని మీరు కోరుకునే ప్రకటనల రకాలను సర్దుబాటు చేయవచ్చు. మీరు ఈ సెట్టింగ్‌లను ఎప్పుడు కావాలంటే అప్పుడు తరచుగా మార్చవచ్చు.

గోప్యతా పరిశీలనను నిర్వహించండి

భద్రతా పరిశీలనతో మీ ఖాతాను సురక్షితంగా ఉంచండి

మీ Google ఖాతాను రక్షించుకోవడానికి మీరు చేయగల మొదటి పని భద్రతా పరిశీలన నిర్వహించడం. మీ పునరుద్ధరణ సమాచారం ఎప్పటికప్పుడు ఆధునీకరించబడుతున్నట్లు మరియు మీ ఖాతాకు కనెక్ట్ చేయబడిన వెబ్‌సైట్‌లు, అనువర్తనాలు మరియు పరికరాలు మీరు ఇప్పటికీ ఉపయోగిస్తున్నవి మరియు విశ్వసిస్తున్నవి అని ధృవపరుచుకోవడంలో మీకు సహాయపడటానికి మేము దీన్ని రూపొందించాము. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, మీరు మీ సెట్టింగ్‌లను లేదా పాస్‌వర్డ్‌ను వెంటనే మార్చుకోవచ్చు. భద్రతా పరిశీలన చేయడానికి కేవలం కొన్ని నిమిషాల సమయం మాత్రమే పడుతుంది మరియు మీరు దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తరచుగా చేయవచ్చు.

భద్రతా పరిశీలనను నిర్వహించండి

మీ ఖాతాతో ఏ డేటా అనుబంధించబడాలో నిర్ణయించండి

మేము మీ ఖాతాతో సేవ్ చేసే డేటా ద్వారా మ్యాప్స్‌లో మెరుగైన నిత్యప్రయాణ ఎంపికలు మొదలుకొని శోధనలో శీఘ్ర ఫలితాల దాకా అన్ని విషయాల్లో Google సేవలను మీకు మరింత ఉపయోగకరంగా చేయగలుగుతాము. కార్యాచరణ నియంత్రణలను ఉపయోగించి, మీరు మీ ఖాతాతో ఏవి అనుబంధించబడాలో నిర్ణయించగలరు మరియు మీ శోధనలు మరియు బ్రౌజింగ్ కార్యాచరణ, మీరు వెళ్లే స్థలాలు మరియు మీ పరికరాల్లోని సమాచారం వంటి నిర్దిష్ట రకాల డేటా సేకరణను పాజ్ చేయగలరు.

కార్యాచరణ నియంత్రణలకు వెళ్లు

మీ ప్రాధాన్యతల ఆధారంగా ప్రకటనలను నియంత్రించండి

మీ ప్రకటనల సెట్టింగ్‌ల్లో, మీకు ఆసక్తి ఉన్న అంశాల ఆధారంగా మీరు ప్రకటనలను నియంత్రించవచ్చు. ఉదాహరణకు, మీరు YouTubeకి సైన్ ఇన్ చేసినప్పుడు మీకు పాప్ సంగీతమంటే ఇష్టమని Googleకి చెప్పడానికి ప్రకటనల వ్యక్తిగతీకరణ సెట్టింగ్‌లను ఉపయోగిస్తే, విడుదల కానున్నవి మరియు సమీపంలో జరిగే కార్యక్రమాలకి సంబంధించిన ప్రకటనలు మీకు చూపబడవచ్చు.

మీరు సైన్ ఇన్ చేసి ఉన్నప్పుడు ప్రకటనల వ్యక్తిగతీకరణను ఆఫ్ చేస్తే, మేము Google సేవలు అలాగే మాతో భాగస్వామ్యం ఏర్పర్చుకున్న వెబ్‌సైట్‌లు మరియు అనువర్తనాల్లో మీ ఆసక్తులకు సంబంధించిన మీ ప్రకటనలను చూపడం ఆపివేస్తాము. మీరు సైన్ అవుట్ చేసి ఉన్నట్లయితే, ప్రకటనల వ్యక్తిగతీకరణను ఆఫ్ చేయడం వలన ప్రకటనలు చూపబడే Google సేవలు మాత్రమే ప్రభావితం అవుతాయి.

ప్రకటనల సెట్టింగ్‌లకు వెళ్లు

మీ ఖాతాలోని నా కార్యాచరణలో ఉన్న డేటాను చూడండి

నా కార్యాచరణ అనేది మీరు మా సేవలను ఉపయోగించి శోధించిన, వీక్షించిన మరియు చూసిన అంశాలను కనుగొనగల కేంద్ర స్థానం. మీ గత ఆన్‌లైన్ కార్యాచరణను సులభంగా గుర్తు తెచ్చుకునేలా చేయడం కోసం మేము అంశం, తేదీ మరియు ఉత్పత్తి ఆధారంగా శోధించడం కోసం మీకు సాధనాలను అందిస్తాము. మీరు మీ ఖాతాతో అనుబంధించకూడదనుకునే నిర్దిష్ట కార్యాచరణలు లేదా మొత్తం అంశాలను కూడా శాశ్వతంగా తొలగించవచ్చు.

నా కార్యాచరణకు వెళ్లు

మీ ప్రాథమిక ఖాతా సమాచారాన్ని సమీక్షించండి

మీరు Google సేవల్లో భాగస్వామ్యం చేసే వ్యక్తిగత సమాచారం అనగా మీ పేరు, ఇమెయిల్ చిరునామా మరియు ఫోన్ నంబర్ వంటివి నియంత్రించండి.

మీ వ్యక్తిగత సమాచారాన్ని సమీక్షించండి

మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోండి సేవతో మీ కంటెంట్‌ను ఎక్కడికి అయినా తీసుకెళ్లండి

మీ ఫోటోలు. మీ ఇమెయిల్‌లు. మీ పరిచయాలు. ఇంకా మీ బుక్‌మార్క్‌లు. మీకు మీ Google ఖాతాలో నిల్వ చేసిన కంటెంట్‌పై నియంత్రణ ఉంటుంది. అందుకోసమే మేము మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోండి సేవను రూపొందించాము — దీని వలన మీరు ఒక కాపీని రూపొందించవచ్చు, దీన్ని బ్యాకప్ చేయవచ్చు లేదా మరొక సేవకు కూడా తరలించవచ్చు.

మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోండి సేవకు వెళ్లు