మీ భద్రత

మేము చేసే ప్రతి పనిలో మీ భద్రతకే మా మొదటి ప్రాధాన్యత.

మీ డేటా సురక్షితంగా లేకుంటే, అది ప్రైవేట్ అనిపించుకోదు. అందువల్ల శోధన, మ్యాప్స్ మరియు YouTube వంటి Google సేవలు ప్రపంచంలోని అత్యంత అధునాతన భద్రతా వ్యవస్థల్లోని ఒక దానిచే రక్షించబడ్డాయని మేము నిర్ధారించుకుంటాము.

బదిలీ జరుగుతున్నప్పుడు గుప్తీకరణ మీ డేటాను ప్రైవేట్‌గా ఉంచుతుంది

గుప్తీకరణ మా సేవలకు అత్యుత్తమ స్థాయి భద్రత మరియు గోప్యతను అందిస్తుంది. మీరు ఇమెయిల్ పంపడం, వీడియోను భాగస్వామ్యం చేయడం, వెబ్‌సైట్‌ను సందర్శించడం లేదా మీ ఫోటోలను నిల్వ చేయడం వంటివి చేస్తున్నప్పుడు మీరు సృష్టించే డేటా మీ పరికరం, Google సేవలు మరియు మా డేటా కేంద్రాల మధ్య తరలించబడుచూ ఉంటుంది. మేము ఈ డేటాను బహుళ దశల్లో రక్షిస్తాము, ఇందులో HTTPS మరియు రవాణా దశ భద్రత వంటి అత్యుత్తమ గుప్తీకరణ సాంకేతికత ఉంటాయి.

మా క్లౌడ్ మౌలిక సదుపాయం మీ డేటాను 24/7 రక్షిస్తుంది

డేటా అనుకూల-రూపకల్పన డేటా కేంద్రాల నుండి సముద్రంలోని ఫైబర్ కేబుల్‌లకు ఖండాల మధ్య బదిలీ చేయబడుతుంది, Google ప్రపంచంలోని అత్యంత సురక్షిత మరియు విశ్వసనీయ క్లౌడ్ మౌలిక సదుపాయాల్లో ఒకదాన్ని నిర్వహిస్తుంది. మరియు మీ డేటాను రక్షించడానికి ఇది నిరంతరం పర్యవేక్షించబడుతుంది మరియు మీకు అవసరమైనప్పుడు దాన్ని అందుబాటులోకి తెస్తుంది. నిజానికి, మేము డేటాను బహుళ డేటా కేంద్రాల మధ్య పంపిణీ చేస్తాము, కాబట్టి అగ్ని ప్రమాదం లేదా విపత్తు సంభవించినా కూడా డేటా స్వయంచాలకంగా మరియు సజావుగా స్థిరమైన మరియు సురక్షితమైన స్థానాలకు బదిలీ చేయబడుతుంది.

ప్రమాద గుర్తింపు లక్షణం మా సేవలను రక్షించడంలో సహాయపడుతుంది

మేము స్పామ్, మాల్వేర్, వైరస్‌లు మరియు ఇతర హానికర కోడ్‌ల రూపంలో ఉండే వాటితో సహా దాడుల నుండి మా సేవలను మరియు మౌలిక సదుపాయాలను రక్షించడానికి వాటిని నిరంతరం పర్యవేక్షిస్తుంటాము.

మేము ప్రభుత్వాలు నేరుగా మీ డేటాను ప్రాప్యత చేసుకోవడానికి వాటిని అనుమతించము

మేము డేటాకు లేదా మీ డేటా, వ్యవధిని నిల్వ చేసే మా సర్వర్‌లకు “దొడ్డిదారి” ప్రాప్యతను అస్సలు అందించము. అంటే ఏదైనా ప్రభుత్వ సంస్థ, యు.ఎస్ లేదా మరొక దేశం మా వినియోగదారుల సమాచారాన్ని నేరుగా ప్రాప్యత చేయలేదు. మేము అప్పుడప్పుడు చట్ట పరిరక్షణ సంస్థల నుండి వినియోగదారు డేటా కోరుతూ అభ్యర్థనలను స్వీకరిస్తాము. మా న్యాయ సంబంధ శాఖ ఈ అభ్యర్థనలను సమీక్షిస్తుంది మరియు అభ్యర్థన చాలా పరుష పదజాలంతో నిండి ఉన్నా లేదా సరైన ప్రాసెస్‌ను అనుసరించకపోయినా తిరిగి పంపుతుంది. మేము మా పారదర్శక నివేదికలో ఈ డేటా అభ్యర్థనల గురించి పారదర్శకంగా ఉండటానికి కష్టపడి పని చేస్తున్నాము.

గుప్తీకరణ అనేది ఈఫిల్ టవర్ ఫోటో కంటే ఎక్కువ స్థాయిలో ఉంది

Gmail గుప్తీకరణ ఇమెయిల్‌ను ప్రైవేట్‌గా ఉంచుతుంది

మొదటి రోజు నుండే, Gmail గుప్తీకరించిన కనెక్షన్‌లకు మద్దతిచ్చింది, దీని వల్ల చెడ్డ వ్యక్తులకు మీరు పంపుతున్న వాటిని చదవడం కష్టం. Gmail సంభావ్య భద్రతా రిస్క్‌ల గురించి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మీరు ఇమెయిల్‌ను స్వీకరించినప్పుడు అది గుప్తీకరించిన కనెక్షన్‌లో పంపబడకపోవడం వంటివి.

Gmail ఇమెయిల్ ఎన్వలప్ భద్రతా స్కానర్ హెచ్చరిక సంకేతాన్ని ఆఫ్‌కి సెట్ చేస్తుంది

Gmail స్పామ్ రక్షణ అనుమానాస్పద ఇమెయిల్‌లను ఫిల్టర్ చేస్తుంది

అనేక మాల్వేర్ మరియు ఫిషింగ్ దాడులు ఇమెయిల్‌తోనే ప్రారంభమవుతాయి. Gmail భద్రత మిమ్మల్ని స్పామ్, ఫిషింగ్ మరియు మాల్వేర్ నుండి మరేదైనా ఇమెయిల్ సేవ కంటే కూడా ఉత్తమంగా రక్షిస్తుంది. వినియోగదారు స్పామ్‌గా గుర్తు పెట్టిన ఇమెయిల్‌ల లక్షణాలను గుర్తించడానికి బిలియన్ల కొద్దీ సందేశాల నుండి గీసిన నమూనాలను Gmail విశ్లేషిస్తుంది, ఆపై అనుమానాస్పద లేదా హానికర ఇమెయిల్‌లు మీకు రావడానికి ముందే వాటిని నిరోధించడానికి గుర్తుపెట్టిన వాటిని ఉపయోగిస్తుంది. మీరు స్వీకరించే అనుమానాస్పద ఇమెయిల్‌ల కోసం "స్పామ్‌ను నివేదించు" ఎంచుకోవడం ద్వారా మీరు సహాయపడవచ్చు.

యంత్ర అభ్యాసం మరియు కృత్రిమ మేథస్సు Gmail స్పామ్ ఫిల్టర్‌ను ఎప్పటికీ మరింత ఖచ్చితంగా చేయడంలో సహాయపడుతుంది. ఇది ఇప్పుడు మీ ఇన్‌బాక్స్ నుండి 99.9% స్పామ్‌ను తీసివేస్తుంది.

భద్రతా నవీకరణ ప్రోగ్రెస్ ఉన్న Chrome బ్రౌజర్

Chrome మీ బ్రౌజర్ భద్రతను స్వయంచాలకంగా నవీకరిస్తుంది

భద్రతా సాంకేతికతలు ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి, కాబట్టి ఎప్పటికప్పుడు తాజా సంస్కరణలను పొందడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు. ఇందుకోసమే Chrome మీరు ఉపయోగిస్తున్న బ్రౌజర్ సంస్కరణ మాల్వేర్ మరియు మోసపూరిత సైట్‌లు మొదలైనవాటి నుండి రక్షించబడటానికి తాజా భద్రతా పరిష్కారాలు, సంరక్షణలతో నవీకరించబడిందని నిర్ధారించుకోవడానికి క్రమంగా తనిఖీ చేస్తుంది. Chrome స్వయంచాలకంగా నవీకరిస్తుంది, కాబట్టి మీరు మిమ్మల్ని సంరక్షించే సరికొత్త Chrome భద్రతా సాంకేతికతను కలిగి ఉంటారు.

హానికర అనువర్తనం మీ పరికరంలోకి చొరబడుతుంది

Google Play సంభావ్య హానికర అనువర్తనాలను మీ ఫోన్ నుండి తీసివేస్తుంది

మీ పరికరానికి పొంచి ఉన్న అతిపెద్ద భద్రతా భేద్యత ఏమిటంటే దానిలో మీరు ఇన్‌స్టాల్ చేసే అనువర్తనాలు. మా గుర్తింపు సిస్టమ్ సంభావ్య హాని కలిగించే అనువర్తనాలు Play స్టోర్‌ని చేరుకోకముందే ఫ్లాగ్ చేస్తాయి. ఒక అనువర్తనం సురక్షితమైనదో కాదో మాకు ఖచ్చితంగా తెలియకపోతే, దాన్ని Android భద్రతా బృందం సభ్యులు మాన్యువల్‌గా సమీక్షిస్తారు. మేము మా గుర్తింపు సిస్టమ్‌ను మరింత మెరుగుపరుస్తున్నందున Google Playలో ఇప్పటికే ఉన్న అనువర్తనాలను తిరిగి మూల్యాంకనం చేసి, హాని కలిగించే అవకాశం ఉన్న వాటిని తీసివేస్తాము కాబట్టి అవి మీ పరికరాన్ని చేరుకోలేవు.

Google హానికర మరియు తప్పుదారి పట్టించే ప్రకటనలను నిరోధిస్తుంది

మీ ఆన్‌లైన్ అనుభవం మాల్వేర్‌ను కలిగి ఉండే ప్రకటనల వలన, మీరు చూడటానికి ప్రయత్నిస్తున్న కంటెంట్‌ను కవర్ చేయడం వలన, నకిలీ వస్తువుల ప్రచారం లేదంటే మా ప్రకటన విధానాలను ఉల్లంఘించడం వలన పాడు కావచ్చు. మేము ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తాము. ప్రతి సంవత్సరం మా ప్రత్యక్ష సమీక్షకులు మరియు అత్యాధునిక సాఫ్ట్‌వేర్ దాదాపు మిలియన్ చెడు ప్రకటనలను బ్లాక్ చేస్తున్నారు/చేస్తుంది. అలాగే మేము అభ్యంతరకర ప్రకటనలను నివేదించడానికి మరియు మీకు కనిపించే ప్రకటనలను నియంత్రించడానికి సాధనాలను అందిస్తాము. అలాగే మేము ఇంటర్నెట్‌ను అందరి కోసం సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి మా అంతర్దృష్టులు మరియు ఉత్తమ పద్ధతులను ఎప్పటికప్పుడు ప్రచురిస్తాము.

మీరు ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండటానికి సహాయపడే ప్రముఖ చిట్కాలు

ఈ త్వరిత చిట్కాలతో మీ ఆన్‌లైన్ ఖాతాలు మరియు వ్యక్తిగత డేటాను రక్షించుకోండి.

  • మీ పరికరాలను రక్షించండి

  • ఫిషింగ్ ప్రయత్నాలను నివారించండి

  • ఇంటర్నెట్‌ను సురక్షితంగా బ్రౌజ్ చేయండి

Google భద్రతా షీల్డ్ మరియు తనిఖీ జాబితా

శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను సృష్టించండి

మీ ఆన్‌లైన్‌ ఖాతాలను రక్షించడంలో మీరు తీసుకోగలిగే అత్యంత కీలకమైన దశ బలమైన, సురక్షిత పాస్‌వర్డ్‌‌ను సృష్టించడం. మీరు మర్చిపోకుండా ఉండే మరియు ఇతరులు ఊహించడానికి కష్టంగా ఉండే పదాల శ్రేణిని ఉపయోగించడం ద్వారా మీరు దీన్ని చేయవచ్చు. లేదా ప్రతి పదం యొక్క మొదటి అక్షరాలతో పొడవైన వాక్యాన్ని తీసుకొని పాస్‌వర్డ్‌ని సృష్టించండి. దీన్ని మరింత శక్తివంతం చేయడానికి, కనీసం 8 అక్షరాల పొడవు ఉండేలా చేయండి, ఎందుకంటే మీ పాస్‌వర్డ్‌‌ ఎంత పొడవుగా ఉంటే, అది అంత శక్తివంతంగా ఉంటుంది.

భద్రతా ప్రశ్నల కోసం సమాధానాలను రూపొందించమని అడిగితే, వాళ్లు ఊహించడానికి మరింత కష్టంగా ఉండేలా చేయడానికి నకిలీ సమాధానాలను ఉపయోగించడాన్ని పరిగణించండి.

ఎప్పుడూ ఒకే పాస్‌వర్డ్‌ను రెండుసార్లు ఉపయోగించవద్దు

ప్రతి ఖాతాకు ప్రత్యేక పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి

మీ Google ఖాతా, సామాజిక మీడియా ప్రొఫైళ్ళు మరియు రిటైల్ వెబ్‌సైట్‌లు వంటి బహుళ ఖాతాలకు లాగిన్ చేయడానికి అదే పాస్‌వర్డ్‌ని ఉపయోగించడం, మీ భద్రత ప్రమాదాన్ని పెంచుతుంది. అది మీ ఇల్లు, కారు మరియు కార్యాలయానికి ఒకే తాళాన్ని ఉపయోగించడం లాంటిది - ఎవరైనా ఒక దానికి యాక్సెస్ పొందితే, అన్ని రాజీపడవచ్చు.

బహుళ పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోండి

Chrome బ్రౌజర్‌లోని Google Smart Lock లాంటి పాస్‌వర్డ్‌ మేనేజర్, మిమల్ని సురక్షితంగా ఉంచడానికి మరియు మీ విభిన్న ఆన్‌లైన్ ఖాతాల అన్ని పాస్‌వర్డ్‌లను గుర్తించుకోవడానికి సహాయపడుతుంది. ఇది భద్రతా ప్రశ్నలకు మీ సమాధానాలను ట్రాక్ చేయగలదు మరియు మీ కోసం యాదృచ్ఛిక పాస్‌వర్డ్‌లను రూపొందించగలదు.

2-దశల ధృవీకరణతో హ్యాకర్‌ల దాడి నుండి రక్షించుకోండి

2-దశల ధృవీకరణ, మీ ఖాతాలో లాగిన్ చేయడానికి, మీ వినియోగదారుని ‌పేరు మరియు పాస్‌‌వర్డ్ మాత్రమే కాకుండా, మీరు రెండవ అంశాన్ని ఉపయోగించే అవసరం ద్వారా మీ ఖాతాకు యాక్సెస్ ఉండకూడనవారిని ఎవరినైనా దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, Googleతో, ఇది విశ్వసనీయ పరికరం నుండి లాగిన్‌ను ఆమోదించడానికి, Google ప్రామాణీకరణదారు యాప్ లేదా మీ Google యాప్‌లోని ప్రాంప్ట్ నుండి సృష్టించబడిన ఆరు అంకెల కోడ్ కావచ్చు.

ఫిషింగ్‌కు వ్యతిరేకంగా మరింత రక్షణ కోసం, మీరు మీ కంప్యూటర్ USB పోర్ట్‌లోకి చొప్పించబడే లేదా NFC (సమీప క్షేత్ర కమ్యూనికేషన్) లేదా బ్లూటూత్‌ని ఉపయోగించి మీ మొబైల్ పరికరానికి కనెక్ట్ చేసే భౌతిక భద్రతా కీని ఉపయోగించవచ్చు.

మీ సాఫ్ట్‌వేర్‌ను నవీకృతంగా ఉంచండి

భద్రతా ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే, ఎల్లప్పుడూ మీ వెబ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్, ప్లగిన్‌లు లేదా పత్రం ఎడిటర్‌లు అన్నింటిలోనూ తాజా సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించండి. మీ సాఫ్ట్‌వేర్‌ని అప్‌డేట్ చేయాల్సిందిగా మీకు నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడు, వీలైనంత త్వరగా దానిని పూర్తి చేయండి.

మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న తాజా వెర్షన్లను వాడుతున్నట్లు నిర్ధారించుకోవడానికి మీరు ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించండి. Chrome బ్రౌజర్‌తో సహా కొన్ని సేవలు స్వయంచాలకంగా వాటికి అవే అప్‌డేట్ అవుతాయి.

స్క్రీన్ లాక్‌ను ఉపయోగించండి

మీరు మీ కంప్యూటర్, లాప్‌టాప్, టాబ్లెట్ లేదా ఫోన్‌ను ఉపయోగించనప్పుడు, మీ పరికరాన్ని ఇతరులు తెరవకుండా ఉండడానికి మీ స్క్రీన్‌ను లాక్ చేయండి. అదనపు భద్రత కోసం, నిద్రావస్థలోకి వెళ్లినప్పుడు మీ పరికరం స్వయంచాలకంగా లాక్ అయ్యేలా సెట్ చేయండి.

మీరు మీ ఫోన్‌ను కోల్పోతే, దాన్ని లాక్ చేయండి

మీ ఫోన్ ఎప్పుడైనా పోయినా లేదా దొంగిలించబడినా, కొన్ని త్వరిత దశలలో మీ డేటాను రక్షించడానికి, నా ఖాతాను సందర్శించి, "మీ ఫోన్‌ను కనుగొనండి"ని ఎంచుకోండి. మీ వద్ద Android లేదా iOS పరికరం ఉన్నా, మీరు మీ ఫోన్‌ను రిమోట్‌గా గుర్తించవచ్చు మరియు లాక్ చేయవచ్చు. కాబట్టి ఎవరూ మీ ఫోన్‌ను ఉపయోగించలేరు మరియు మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయలేరు.

బ్రౌజర్ Chromeలో పాస్‌వర్డ్‌లు సురక్షితంగా ఉంచబడటాన్ని చూపుతోంది

హానికరమైన యాప్‌లను మీ ఫోన్‌కి దూరంగా ఉంచండి

ఎప్పుడూ మీరు విశ్వసించే మూల నుండి మీ మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. Android పరికరాలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడడానికి, Google Play రక్షణ, Google Play స్టోర్‌లోని యాప్‌లపై, వాటిని మీరు డౌన్‌లోడ్‌ చేయగలిగే ముందే భద్రతా తనిఖీని అమలు చేస్తుంది మరియు కాలానుగుణంగా ఇతర మూలాలలోని సంభావ్య హానికరమైన యాప్‌ల కోసం మీ పరికరాన్ని తనిఖీ చేస్తుంది.

మీ డేటాను రక్షించడానికి:

  • మీ యాప్‌లను సమీక్షించి, మీరు ఉపయోగించని వాటిని తొలగించండి
  • మీ యాప్ స్టోర్ సెట్టింగ్‌లను సందర్శించి, స్వీయ అప్‌డేట్‌లను ప్రారంభించండి
  • మీరు విశ్వసించే యాప్‌లకు మీ స్థానం మరియు ఫోటోల వంటి గోప్యమైన డేటాకు మాత్రమే యాక్సెస్ ఇవ్వండి

ఇమెయిల్ స్కామ్‌లు, నకిలీ ప్రైజ్‌లు మరియు బహుమతులతో జాగ్రత్తగా ఉండండి

అపరిచితుల నుండి వచ్చిన సందేశాలు ఎప్పుడూ అనుమానించదగ్గవి, ప్రత్యేకంగా అవి నిజమైనవిగా కనిపిస్తుంటే — అంటే మీరు ఏదో గెలిచారని ప్రకటించడం, ఒక సర్వేను పూర్తి చేసినందుకు బహుమతులను అందించడం లేదా డబ్బు సంపాదించడానికి త్వరిత మార్గాలను ప్రోత్సహించడం వంటివి. అనుమానాస్పద లింకులను ఎప్పుడూ క్లిక్ చేయవద్దు, మరియు సందేహాస్పద ఫారమ్‌లలో మరియు సర్వేలలో వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ నమోదు చేయవద్దు.

వ్యక్తిగత సమాచార అభ్యర్థనలతో జాగ్రత్తగా ఉండండి

పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ ఖాతా మరియు క్రెడిట్ కార్డ్ నంబర్‌లు లేదా మీ పుట్టినరోజు వంటి వ్యక్తిగత సమాచారం కోసం అనుమానాస్పద ఇమెయిల్‌లు, తక్షణ సందేశాలు లేదా పాప్-అప్ విండోలకు ప్రత్యుత్తరం ఇవ్వవద్దు. మీ బ్యాంక్ వంటి మీరు విశ్వసించే సైట్ నుండి సందేశం వచ్చినప్పటికీ, లింక్‌పై క్లిక్ చేయవద్దు లేదా ప్రత్యుత్తర సందేశాన్ని పంపవద్దు. మీ ఖాతాలోకి లాగిన్ చేయడానికి వారి వెబ్‌సైట్ లేదా యాప్‌కు నేరుగా వెళ్లడం ఉత్తమం.

గుర్తుంచుకోండి, చట్టబద్ధమైన సైట్‌లు మరియు సేవలు మిమల్ని ఇమెయిల్ ద్వారా పాస్‌వర్డ్‌లు లేదా ఆర్ధిక సమాచారాన్ని పంపించమని అభ్యర్థించే సందేశాలను పంపించవు.

మరొక వ్యక్తిలా నటించే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి

మీకు తెలిసినవారు ఎవరైనా మీకు ఇమెయిల్ పంపిన సందేశం అసాధారణమైనదిగా కనిపిస్తే, వారి ఖాతా హ్యాక్ చేయబడి ఉండవచ్చు.

వీటిని చూడండి:

  • డబ్బు కోసం వచ్చే అత్యవసర అభ్యర్థనలు
  • మరొక దేశంలో ఒంటరిగా చిక్కుకున్నట్లు చెప్పే వ్యక్తి
  • తన ఫోన్ దొంగిలించబడటం వలన ఎవరి నుండి కాల్‌లను స్వీకరించలేకపోతున్నట్లు చెప్పే వ్యక్తి

మీరు ఇమెయిల్ చట్టబద్ధమైనదని నిర్ధారించగలిగితే తప్ప, సందేశానికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దు లేదా ఏ లింక్‌లను క్లిక్ చేయవద్దు.

డౌన్‌లోడ్ చేసే ముందు రెండుసార్లు సరిచూసుకోండి

కొన్ని అధునాతన ఫిషింగ్ దాడులు హానికరమైన పత్రాలు మరియు PDF జోడింపుల ద్వారా సంభవించవచ్చు. మీరు అనుమానాస్పద జోడింపును చూస్తే, దాన్ని సురక్షితంగా తెరవడానికి మరియు మీ పరికరానికి హాని కలిగే ప్రమాదాన్ని తగ్గించడానికి Chrome లేదా Google డిస్క్‌ను ఉపయోగించండి. మేము వైరస్‌ను కనుగొంటే, మేము మీకు హెచ్చరికను చూపుతాము.

సురక్షిత నెట్‌వర్క్‌‌లను ఉపయోగించండి

పబ్లిక్ లేదా ఉచిత WiFiను ఉపయోగించడం గురించి జాగ్రత్త వహించండి, పాస్‌వర్డ్‌ అవసరమైనవి అయినప్పటికీ. మీరు పబ్లిక్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసినప్పుడు, సమీపంలో ఉన్న ఎవరైనా, మీరు సందర్శించే వెబ్‌సైట్‌లు మరియు మీరు సైట్‌లలో టైప్ చేసే సమాచారం వంటి మీ ఇంటర్నెట్ కార్యకలాపాన్ని పర్యవేక్షించగలరు. ఒకవేళ పబ్లిక్ లేదా ఉచిత WiFiను మాత్రమే మీరు వాడాలి అన్నట్లయితే, Chrome బ్రౌజర్, చిరునామా బార్‌లో సైట్ సురక్షితమా కాదా అని మీకు తెలియజేస్తుంది.

అతి ముఖ్యమైన సమాచారాన్ని నమోదు చేయడానికి ముందు సురక్షిత కనెక్షన్‌ల కోసం చూడండి

మీరు వెబ్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు – ముఖ్యంగా మీరు పాస్‌వర్డ్‌ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలు వంటి అతి ముఖ్యమైన సమాచారాన్ని నమోదు చేయలనుకుంటే - మీరు సందర్శించే సైట్‌లకు కనెక్షన్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోండి. సురక్షితమైన URL HTTPSతో ప్రారంభమవుతుంది. Chrome బ్రౌజర్, URL ఫీల్డ్‌లో ఆకుపచ్చగా, పూర్తిగా లాక్ చేసిన చిహ్నాన్ని చూపి, "సురక్షితం" అని చెబుతుంది. అది సురక్షితమైనది కాకపోతే, "సురక్షితం కాదు" అని చెబుతుంది. HTTPS అనేది మీ బ్రౌజర్ లేదా యాప్‌ని మీరు సందర్శించే వెబ్‌సైట్‌లతో సురక్షితంగా కనెక్ట్ చేయడం ద్వారా మీ బ్రౌజింగ్‌ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.