మీ డేటా

మేము ఏ డేటాని సేకరించి, ఉపయోగిస్తామో మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము.

మీరు Google సేవలను ఉపయోగిస్తున్నప్పుడు, మీ డేటా విషయంలో మమ్మల్ని విశ్వసించాలి. మా సేవలను మీ కోసం మరింత మెరుగ్గా పనిచేసేలా చేయడానికి మేము ఏమి సేకరిస్తాము, దాన్ని ఎలా ఉపయోగిస్తాము అనే విషయాన్ని స్పష్టం చేయడం మా బాధ్యత.

ఇవి మేము డేటాను సేకరించే మూడు ప్రధాన మర్గాలు:

మీరు చేసే పనులు

మీరు మా సేవలను ఉపయోగించినప్పుడు — ఉదాహరణకు, Googleలో శోధించడం, Google మ్యాప్స్‌లో దిశలను పొందడం లేదా YouTubeలో వీడియోను చూడటం — మేము ఈ సేవలు మీ కోసం పనిచేసేలా చేయడం కోసం డేటాను సేకరిస్తాము. ఇందులో ఇవి ఉంటాయి:

 • మీరు శోధించే విషయాలు
 • మీరు సందర్శించే వెబ్‌సైట్‌లు
 • మీరు చూసే వీడియోలు
 • మీరు క్లిక్ చేసే లేదా నొక్కే ప్రకటనలు
 • మీ స్థానం
 • పరికర సమాచారం
 • IP చిరునామా మరియు కుక్కీ డేటా

మీరు సృష్టించే అంశాలు

మీరు మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేస్తే, మా సేవలను ఉపయోగించి మీరు సృష్టించే దాన్ని మేము నిల్వ చేసి, సంరక్షిస్తాము. ఇందులో ఇవి ఉంటాయి:

 • Gmailలో మీరు పంపే మరియు స్వీకరించే ఇమెయిల్‌లు
 • మీరు జోడించుకునే పరిచయాలు
 • క్యాలెండర్ ఈవెంట్‌లు
 • మీరు అప్‌లోడ్ చేసే ఫోటోలు మరియు వీడియోలు
 • డిస్క్‌లో డాక్స్, షీట్‌లు మరియు స్లయిడ్‌లు

ఇది “మీరు” అని గుర్తించే అంశాలు

మీరు Google ఖాతా కోసం సైన్ అప్ చేసినప్పుడు, మీరు మాకు అందించే ప్రాథమిక సమాచారాన్ని మేము భద్రంగా ఉంచుతాము. మీకు సంబంధించిన ఇలాంటి వివరాలు:

 • పేరు
 • ఇమెయిల్ చిరునామా మరియు పాస్‌వర్డ్
 • పుట్టినరోజు
 • లింగం
 • ఫోన్ నంబర్
 • దేశం
స్మార్ట్‌ఫోన్‌లో Google మ్యాప్స్

Google మ్యాప్స్ మీ స్థలాలను వేగంగా ఎలా పొందుతుంది

మీరు Google మ్యాప్స్ అనువర్తనాన్ని ఉపయోగించినప్పుడు, మీ ఫోన్ Googleకి తిరిగి మీ స్థానం గురించి అనామక డేటాను పంపుతుంది. ఇది ట్రాఫిక్ నమూనాలను గుర్తించడానికి మీ చుట్టూ ఉండే వ్యక్తుల డేటాను కలిగి ఉంటుంది. ఉదాహరణకు, మ్యాప్స్ ఒకే వీధిలో చాలా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నప్పుడు గుర్తించి, అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉందని మీకు తెలియజేస్తుంది. కాబట్టి తదుపరిసారి మ్యాప్స్ మిమ్మల్ని ప్రమాదం గురించి హెచ్చరించి, మీకు వేగంగా వెళ్లేందుకు మార్గాన్ని సూచించినప్పుడు, త్వరగా వెళ్లేందుకు మీకు డేటాను అందించినందుకు మీ తోటి డ్రైవర్‌లకు మీరు ధన్యవాదాలు తెలపాలి.

స్వీయపూరణతో Google శోధన పట్టీ

Google మీ శోధనలను ఎలా స్వీయపూరణ చేస్తుంది

మీరు దేనికోసమైనా శోధిస్తున్నప్పుడు ఏదైనా పదం అక్షరక్రమం తప్పుగా పేర్కొన్నా కానీ Google కొంతమేరకు మీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలదని మీకు తెలుసా? మా అక్షరక్రమ దిద్దుబాటు మోడల్ అదే తప్పు చేసిన వ్యక్తుల నుండి డేటాను ఉపయోగించి మీ కోసం ముందే సరిచేస్తుంది. ఈ కారణంగానే మీరు “Barsalona” అని టైప్ చేసినప్పుడు, “Barcelona” కోసమే శోధిస్తున్నారని మేము తెలుసుకుంటాము.

Google మీ శోధనలను స్వీయపూరణ చేయడంలో కూడా శోధన చరిత్ర సహాయపడుతుంది. మీరు మునుపు “Barcelona flights” కోసం శోధించి ఉంటే, మీరు టైప్ చేయడం ముగించేలోపే మేము దాన్ని శోధన పెట్టెలో సూచించవచ్చు. లేదా మీరు ఫుట్‌బాల్ క్లబ్ అభిమాని అయితే మరియు తరచుగా “Barcelona scores” కోసం శోధించేటట్లయితే, మేము వెంటనే దాన్ని సూచించవచ్చు.

స్వీయపూరణ ద్వారా పూర్తి చేసిన ఫారమ్‌తో Chrome ట్యాబ్

Chrome మీ కోసం ఫారమ్‌లను ఎలా పూర్తి చేస్తుంది

మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే లేదా ఖాతా కోసం సైన్ అప్ చేసే ప్రతిసారి, మీరు వ్యక్తిగత సమాచారాన్ని పూరించడానికి మీ సమయాన్ని వెచ్చిస్తారు. మీరు Chromeని ఉపయోగించినప్పుడు, మేము మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామా మరియు చెల్లింపు సమాచారం వంటి అంశాలను సేవ్ చేస్తాము కావున మేము మీ కోసం ఈ ఫారమ్‌ల స్వీయపూరణ చేయగలుగుతాము. మీరు ఎప్పుడైనా నిర్దిష్ట స్వీయపూరణ ఫీల్డ్‌లను సవరించవచ్చు లేదా ఈ సెట్టింగ్‌ను పూర్తిగా నిలిపివేయవచ్చు.

ప్రొఫైల్ ఫోటో మరియు ప్రైవేట్ ఫలితాల బటన్‌తో Google శోధన పట్టీ

Google శోధన మీ స్వంత సమాచారాన్ని కనుగొనడానికి మీకు ఎలా సహాయపడుతుంది

Google శోధన Gmail, Google ఫోటోలు, క్యాలెండర్ మొదలైనవాటి నుండి ఉపయుక్తంగా ఉండే సమాచారాన్ని పొంది, దాన్ని మీ ప్రైవేట్ శోధన ఫలితాల్లో చూపుతుంది కావున మీరు అంత కష్టపడనవసరం లేదు. “my dentist appointment”, “show me my photos at the beach” లేదా “where is my hotel reservation” వంటి అంశాల కోసం శోధించండి. మీరు సైన్ ఇన్ చేసి ఉన్నంతవరకు, మేము ఈ సమాచారాన్ని ఇతర Google సేవల నుండి సేకరించి, ఒక్క దశలోనే మీకు అందిస్తాము.

ఒక వినియోగదారు మరియు Google సహాయకం మధ్య చాట్ బుడగలు

అంశాలను పూర్తి చేయడంలో మీ Google సహాయకం మీకు ఎలా సహాయం చేయగలదు

మీరు ఇంట్లో ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా, మీ సహాయకం ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు మీ సహాయకాన్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు లేదా ఏమి చేయాలో దానికి చెప్పినప్పుడు, మీకు కావాల్సిన దాన్ని చేయడానికి ఇది ఇతర Google సేవల నుండి డేటాను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, మీరు “సమీపంలో ఏ కాఫీ షాప్‌లు ఉన్నాయి?” లేదా “రేపు నేను గొడుగు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందా?” అని అడిగితే మీకు అత్యంత సందర్భోచిత సమాధానాన్ని అందించడానికి మీ సహాయకం మ్యాప్స్ మరియు శోధన అలాగే మీ స్థానం, ఆసక్తులు మరియు ప్రాధాన్యతల నుండి సమాచారాన్ని ఉపయోగిస్తుంది. మీరు మీ సహాయకంతో చేసిన పరస్పర చర్యల నుండి సేకరించిన డేటాను వీక్షించడానికి లేదా తొలగించడానికి ఎల్లప్పుడూ నా కార్యాచరణ సాధనాన్ని సందర్శించవచ్చు.

మీ Google అనుభవంపై నియంత్రణను కలిగి ఉండండి

ఏ సమయంలోనైనా మీ గోప్యతను నిర్వహించడం కోసం ఉపయోగించే కొన్ని సాధనాలు ఇక్కడ ఉన్నాయి.

నా ఖాతా ప్రదర్శించబడిన బ్రౌజర్

నా ఖాతాలో మీ గోప్యతా సెట్టింగ్‌లను నియంత్రించండి

మీకు Google ఖాతా ఉన్నా లేకున్నా, ఏ రకమైన డేటా మీ కోసం Google సేవలను మెరుగ్గా పనిచేసేలా చేస్తుందో మీరే నిర్ణయించండి. మీ వ్యక్తిగత ఖాతాను నిర్వహించి, మీ గోప్యతను సంరక్షించడంలో మీకు సహాయపడే సాధనాలకు నా ఖాతా మీకు శీఘ్ర ప్రాప్యతను అందిస్తుంది.

Chrome విండోలో గత శోధనలు

మీ ఖాతాలోని నా కార్యాచరణలో ఉన్న డేటాను చూడండి

నా కార్యాచరణ అనేది మీరు మా సేవలను ఉపయోగించి శోధించిన, వీక్షించిన మరియు చూసిన ప్రతిదాన్ని కనుగొనగల కేంద్ర స్థానం. మీ గత ఆన్‌లైన్ కార్యాచరణను సులభంగా గుర్తు చేసుకోవడానికి, మేము మీకు అంశం, తేదీ మరియు ఉత్పత్తి ఆధారంగా శోధించడం కోసం సాధనాలను అందిస్తాము. మీరు మీ ఖాతాతో అనుబంధించకూడదనుకునే నిర్దిష్ట కార్యాచరణలు లేదా మొత్తం అంశాలనైనా శాశ్వతంగా తొలగించవచ్చు.

Chrome అజ్ఞాత చిహ్నం

అజ్ఞాత మోడ్‌తో ప్రైవేట్‌గా వెబ్‌ను బ్రౌజ్ చేయండి

మీ శోధన ఫలితాలు మరింత ఉపయుక్తంగా ఉండేలా చేయడంలో సహాయపడటానికి మీ వెబ్ చరిత్ర సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు మరియు మీ ప్రియమైన వ్యక్తి ఇద్దరూ ఒకే కంప్యూటర్‌ను ఉపయోగిస్తుంటే, వారి పుట్టినరోజు కానుక కోసం ఆన్‌లైన్‌లో శోధించి బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ సర్‌ప్రైజ్ బహుమతి వలన కలిగే ఆశ్చర్యానుభూతి మీ బ్రౌజింగ్ చరిత్ర వలన పాడు కాకూడదని కోరుకుంటారు. ఇటువంటి క్షణాల కోసం, మీ బ్రౌజింగ్ చరిత్రను సేవ్ చేయకుండా Google Chromeను నిరోధించడానికి మీ కంప్యూటర్ లేదా మొబైల్ పరికరంలో అజ్ఞాత విండోను తెరవండి.