సురక్షిత ఇంటర్నెట్

మేము అందరికి ఇంటర్నెట్‌ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాము.

మాకు మా స్వంత వినియోగదారులకు మాత్రమే కాకుండా, మిగిలిన ఆన్‌లైన్ ప్రపంచం మొత్తానికి ప్రయోజనాలను అందించే భద్రత సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న చరిత్ర ఉంది. మేము మా సేవలను సురక్షితంగా ఉంచడానికి సాంకేతికతను సృష్టించినప్పుడు, మేము ప్రతి ఒక్కరికీ ఉపయోగపడటానికి దాన్ని భాగస్వామ్యం చేసేందుకు అవకాశాల కోసం చూస్తుంటాము. అలాగే భద్రతాపరమైన ముప్పులు కాలానుగుణంగా మారుతుంటాయి కావున వాటికి అనుగుణంగా, ముందుచూపుతో మేము తీసుకున్న చర్యలను అనుసరించడానికి ఇతర కంపెనీలకు మార్గం సుగమమవుతుంది.

సురక్షిత బ్రౌజింగ్ అనేది Chrome వినియోగదారులను మాత్రమే కాకుండా మిగిలిన వారినీ సంరక్షిస్తుంది

మేము వాస్తవానికి Chrome వినియోగదారులు హానికారక వెబ్‌సైట్‌లను సందర్శించడానికి ప్రయత్నించిప్పుడు వారికి హెచ్చరికలు పంపడం ద్వారా మాల్వేర్ మరియు ఫిషింగ్ నుండి సంరక్షించడానికి మా సురక్షిత బ్రౌజింగ్ సాంకేతికతను రూపొందించాము. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్‌ను సురక్షితంగా చేయడానికి, మేము ఈ సాంకేతికతను Apple Safari మరియు Mozilla Firefoxతో సహా ఇతర కంపెనీలు వారి బ్రౌజర్‌ల్లో ఉచితంగా ఉపయోగించుకోవడానికి రూపొందించాము. ఈ రోజు, ఆన్‌లైన్‌లో ఉండే సగం జనాభా సురక్షిత బ్రౌజింగ్ ద్వారా సంరక్షించబడింది.

అలాగే మేము వెబ్‌సైట్ యజమానుల సైట్‌లలో భద్రతాపరమైన లోపాలు ఉంటే వారిని హెచ్చరిస్తాము మరియు సమస్యలను శీఘ్రంగా పరిష్కరించడంలో సహాయపడటానికి వారికి ఉచిత సాధనాలను అందిస్తాము. మేము కొత్త భద్రతా సాంకేతికతను అభివృద్ధి చేసి, దాన్ని భాగస్వామ్యం చేయడాన్ని కొనసాగించడం ద్వారా, ప్రతి ఒక్కరి కోసం సురక్షితమైన ఇంటర్నెట్‌ని రూపొందించడంలో సహాయపడతాము.

మీరు ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి మేము HTTPSను ఉపయోగిస్తాము

మా సేవలకు HTTPS గుప్తీకరణ ద్వారా కనెక్ట్ కావడం వలన మీపై నిఘా ఉంచిన వారి నుండి, ప్రమాదకరమైన హ్యాకర్‌ల నుండి మిమ్మల్ని సంరక్షిస్తుంది, దీని వలన మీరు మీకు కావాల్సిన దాన్ని మాత్రమే పొందుతారు మరియు కావాల్సిన చోటుకి చేరుకుంటారు. వెబ్‌సైట్‌లు ఈ అదనపు భద్రతను అనుసరించడాన్ని ప్రోత్సహించడం కోసం, మేము HTTPS గుప్తీకరణను రూపొందించాము, మా శోధన ఫలితాల్లో వెబ్‌సైట్‌లకు ర్యాంక్ ఇస్తున్నప్పుడు Google శోధన అల్గారిథమ్ దీన్ని ఉపయోగిస్తుంది.

మేము భేద్యతలను తొలగించడానికి భద్రతా రివార్డ్‌లను సృష్టించాము

Googleలో మేము మా సేవల్లోని భేద్యతలను కనుగొనడానికి మరియు భద్రతా పరిష్కారాలను సృష్టించడానికి స్వతంత్రంగా పరిశోధనలు చేసే భద్రతా రివార్డ్‌ల ప్రోగ్రామ్‌లను సృష్టించాము. మేము ప్రతి సంవత్సరం పరిశోధన గ్రాంట్లు మరియు బగ్ భత్యాల కోసం మిలియన్ల డాలర్‌లను ప్రదానం చేస్తాము. మేము ప్రస్తుతం Chrome మరియు Android వంటి అనేక Google ఉత్పత్తుల కోసం భద్రతా రివార్డ్ ప్రోగ్రామ్‌లను ఉపయోగిస్తాము.

మేము మా భద్రతా సాధనాలను డెవలపర్‌లకు అందుబాటులో ఉంచుతాము

మా సాంకేతికత ఇతరులకు ఉపయోగపడుతుందని విశ్వసించినప్పుడు మేము దాన్ని భాగస్వామ్యం చేస్తాము. ఉదాహరణకు, మేము మా Google భద్రతా స్కానర్‌ను డెవలపర్‌లకు ఉచితంగా అందుబాటులో ఉంచుతాము, అప్పుడు వారు భద్రతా భేద్యతల కోసం అనువర్తన ఇంజిన్‌లో వారి వెబ్ అప్లికేషన్‌లను స్కాన్ చేసి, విశ్లేషించుకోగలరు.

మేము సురక్షితమైన ఇంటర్నెట్‌ను ప్రోత్సహించడానికి మా పద్ధతుల గురించి డేటాను భాగస్వామ్యం చేస్తాము

2010 నుండి Google పారదర్శక నివేదికను ప్రచురించింది, ఇందులో కాపీరైట్ తొలగింపులు, వినియోగదారు డేటా కోసం ప్రభుత్వ అభ్యర్థనలు మరియు సురక్షిత బ్రౌజింగ్ వంటి భద్రతా కార్యక్రమాల వంటి అంశాలకు సంబంధించిన గణాంకాలు ఉంటాయి. అలాగే మేము వెబ్‌సైట్‌లు మరియు ఇమెయిల్ కోసం గుప్తీకరణ యొక్క పరిశ్రమ అనుసరణపై డేటాను భాగస్వామ్యం చేస్తాము. మేము మా ప్రోగ్రెస్‌ను మా వినియోగదారులతో భాగస్వామ్యం చేయడానికి మాత్రమే కాకుండా, అందరికీ సురక్షిత ఇంటర్నెట్ కోసం ఇతరులు కూడా బలమైన భద్రతా ప్రమాణాలను అనుసరించడాన్ని ప్రోత్సహించడం కోసం దీన్ని చేస్తాము.