ప్రకటనలు ఎలా పని చేస్తాయి

మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ విక్రయించము.

మా వ్యాపారంలో అధిక భాగం Google సేవలు మరియు వెబ్‌సైట్‌లు రెండింటిలోనూ మరియు మా భాగస్వామ్యం ఉన్న మొబైల్ అనువర్తనాల్లోనూ ప్రకటనలను చూపడంపై ఆధారపడి ఉంటుంది. ప్రకటనలు అందరి కోసం మా సేవలను ఉచితంగా ఉంచడంలో సహాయపడతాయి. మేము మీకు ఈ ప్రకటనలను చూపడానికి డేటాను ఉపయోగిస్తాము, కానీ మేము మీ పేరు, ఇమెయిల్ చిరునామా మరియు చెల్లింపు సమాచారం వంటి వ్యక్తిగత సమాచారాన్ని విక్రయించము.

మేము ప్రకటనలు సంబంధితంగా ఉంచడానికి డేటాను ఉపయోగిస్తాము

మేము మీ శోధనలు మరియు స్థానం, మీరు వినియోగించిన వెబ్‌సైట్‌లు అనువర్తనాలు మరియు మీరు చూసిన వీడియోలు మరియు ప్రకటనలు మరియు మీ వయస్సు పరిధి, లింగం మరియు ఆసక్తుల వంటి మీరు మాకు అందించిన వ్యక్తిగత సమాచారంతో సహా, మీ పరికరాల నుండి సేకరించిన డేటాను ఉపయోగించి మీకు ఉపయుక్తంగా ఉండే ప్రకటనలను చూపుతాము.

మీరు సైన్ ఇన్ చేసి, మీ ప్రకటనల సెట్టింగ్‌లపై ఆధారపడి ఉంటే, మీ పరికరాల్లో మీకు కనిపించే ప్రకటనలకు ఈ డేటా తెలియజేస్తుంది. మీరు మీ కార్యాలయంలోని కంప్యూటర్‌లో యాత్రా సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు, మీరు తర్వాత ఆ రోజు రాత్రి మీ ఫోన్‌లో పారిస్‌కి వెళ్లడానికి అయ్యే దారి ఖర్చులకు సంబంధించిన ప్రకటనలను చూడవచ్చు.

ప్రకటనదారులు వ్యక్తులు చూసే లేదా నొక్కే ప్రకటనల కోసం మాత్రమే చెల్లిస్తారు

ప్రకటనదారులు మాతో కలిసి ప్రకటన ప్రచారాలను నిర్వహించినప్పుడు, ఆ ప్రకటనల వాస్తవ పనితీరు ఆధారంగా మాత్రమే వారు మాకు చెల్లిస్తారు అంతేకానీ వ్యక్తిగత సమాచారం ఆధారంగా కాదు. అందులో ఎవరైనా ప్రకటనను వీక్షించడం లేదా నొక్కడం చేసిన ప్రతి సమయం, లేదా అనువర్తనాన్ని డౌన్‌లోడ్ చేయడం లేదా అభ్యర్థన ఫారమ్‌ను పూరించడం వంటి ప్రకటనను చూసినట్లుగా తీసుకునే చర్య వంటివి ఉంటాయి.

ప్రకటనదారులకు వారి ప్రచారాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో మేము చూపుతాము

మేము ప్రకటనదారులకు వారి ప్రకటనల పనితీరు గురించి తెలిపే డేటాను అందిస్తాము, కానీ మేము దీన్ని మీ వ్యక్తిగత సమాచారం ఏదీ బహిర్గతం చేయకుండా చేస్తాము. మీకు ప్రకటనలను చూపే ప్రాసెస్‌లోని ప్రతి పాయింట్ వద్ద, మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా మరియు గోప్యంగా ఉంచుతాము.

ప్రకటనలు Google సేవలు మరియు భాగస్వామ్య సైట్‌లలో ఎలా పనిచేస్తాయి

మేము మీకు ఉపయుక్తంగా ఉండే ప్రకటనలను అవి Google సేవలు లేదా వెబ్‌సైట్‌లు మరియు మాతో భాగస్వాములుగా ఉన్న మొబైల్ అనువర్తనాల్లో ఉన్నా, లేకున్నా చూపడానికి డేటాను ఉపయోగిస్తాము.

బ్రౌజర్ విండోలో వివిధ రంగుల్లోని బైక్‌లు

శోధన ప్రకటనలు ఎలా పనిచేస్తాయి

మీరు Google శోధనను ఉపయోగిస్తున్నప్పుడు, ప్రకటనలు సంబంధిత శోధన ఫలితాల ప్రక్కన లేదా ఎగువ కనిపించవచ్చు. అధిక శాతం, ఈ ప్రకటనలు మీరు ఇప్పుడే చేసిన శోధన మరియు మీ స్థానం ద్వారా ప్రాంప్ట్ చేయబడతాయి. ఉదాహరణకు, మీరు “bikes” కోసం శోధిస్తే, మీరు మీకు సమీపంలో విక్రయానికి ఉన్న బైసైకిల్‌ల కోసం ప్రకటనలను చూడవచ్చు.

ఇతర సందర్భాల్లో, మరింత ఉపయుక్తంగా ఉండే ప్రకటనలను అందించడంలో సహాయపడటానికి మీ గత శోధనలు లేదా మీరు సందర్శించిన సైట్‌ల వంటి అదనపు డేటాను ఉపయోగిస్తాము. మీరు ఇప్పటికే “bikes” కోసం శోధించినందున, ఇప్పుడు మీరు “vacations” కోసం శోధిస్తే, మీరు విహారయాత్రలో ఉన్నప్పుడు బైక్‌పై వెళ్లడానికి స్థలాల కోసం శోధన ప్రకటనలను చూడవచ్చు.

Gmailలో పసుపు రంగుతో హైలైట్ చేయబడిన Google ప్రకటనలు

YouTube ప్రకటనలు ఎలా పనిచేస్తాయి

మీరు YouTubeలో వీడియోలను చూస్తున్నప్పుడు, మీరు ప్రకటనలను ముందు లేదా వీడియో పేజీలో ప్లే అవ్వడాన్ని చూడవచ్చు. ఈ ప్రకటనలు మీరు చూసిన వీడియోలు మరియు మీ ప్రస్తుత మరియు ఇటీవలి YouTube శోధనల వంటి ఇతర డేటా ఆధారంగా ఉంటాయి.

ఉదాహరణకు, మీరు “fashion tips” కోసం శోధించినా లేదా సౌందర్య సంబంధిత వీడియోలను చూసినా, మీరు కొత్త సౌందర్య సిరీస్ కోసం ప్రకటనను చూడవచ్చు. ఈ ప్రకటనలు మీరు చూసే వీడియోల సృష్టికర్తలకు మద్దతివ్వడంలో సహాయపడతాయి.

మీరు చూడకూడదనుకుంటే అనేక YouTube ప్రకటనలను దాటవేయవచ్చు.

ఆనందంగా ఉన్న మహిళ YouTube వీడియో ట్రెండీగా ఉన్న చలువ కళ్లద్దాల కోసం పాప్-అప్ ప్రకటనను కలిగి ఉంది

Gmail ప్రకటనలు ఎలా పనిచేస్తాయి

మీరు Gmailలో చూసే ప్రకటనలు మీ Google ఖాతాతో అనుబంధించబడిన డేటా ఆధారితమైనవి. ఉదాహరణకు, YouTube లేదా శోధన వంటి ఇతర Google సేవలలోని మీ కార్యకలాపం మీరు Gmailలో చూసే ప్రకటనల రకాలను ప్రభావితం చేయవచ్చు. Google, మీకు ప్రకటనలను చూపించడానికి మీ ఇన్‌బాక్స్‌లోని కీలకపదాలు లేదా సందేశాలను ఉపయోగించదు. మీకు ప్రకటనలను చూపించడానికి మీ ఇమెయిల్‌ను ఎవరూ చదవరు.

ప్రొఫైల్ ఫోటో ఉన్న బ్రౌజర్ అందమైన ఆకుపచ్చ రంగు బ్యాగ్ కోసం ప్రకటనను కలిగి ఉంది

Google భాగస్వామ్య సైట్‌ల్లో ప్రకటనలు ఎలా పనిచేస్తాయి

ప్రకటనలను చూపడానికి అనేక వెబ్‌సైట్‌లు మరియు మొబైల్ అనువర్తనాలకు మాతో భాగస్వామ్యం ఉంది. ఈ ప్రకటనదారులు మాతో మా వినియోగదారులు భాగస్వామ్యం చేసిన వ్యక్తిగత సమాచారం మరియు మీ ఆన్‌లైన్ కార్యాచరణల గురించి మేము సేకరించే డేటా ఆధారంగా ప్రేక్షకుల “రకాలకు” నిర్దిష్ట ప్రకటనలను చూపడానికి నిర్ణయించుకుంటారు: ఉదాహరణకు, “ప్రయాణాల పట్ల ఆసక్తి ఉన్న 25 – 34 సంవత్సరాల వయస్సు గల పురుషులు.”

మీరు మునుపు సందర్శించిన సైట్‌ల ఆధారంగా మేము మీకు ప్రకటనలు చూపవచ్చు — ఉదాహరణకు, మీరు మీ ఆన్‌లైన్ షాపింగ్ కార్ట్‌కి జోడించిన, కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకున్న ఆ ఎరుపు రంగు బూట్ల కోసం ప్రకటనను చూడవచ్చు. కానీ మేము దీన్ని మీ పేరు, ఇమెయిల్ చిరునామా లేదా బిల్లింగ్ సమాచారం వంటి వ్యక్తిగత సమాచారం దేన్నీ బహిర్గతం చేయకుండా చేస్తాము.

మీ Google ప్రకటనల అనుభవంపై నియంత్రణ కలిగి ఉండండి

మీరు సైన్ ఇన్ చేసి ఉన్నా లేదా సైన్ అవుట్ చేసి ఉన్నా మీకు కనిపించే ప్రకటనల రకాలను నియంత్రించడానికి మేము మీకు సాధనాలను అందిస్తాము.

ప్రకటన సెట్టింగ్‌లు మరియు చలువ కళ్లద్దాల కోసం ప్రకటనతో టాబ్లెట్

మీ ప్రాధాన్యతల ఆధారంగా ప్రకటనలను నియంత్రించండి

మీ ప్రకటనల సెట్టింగ్‌ల్లో, మీరు మీకు ఆసక్తి ఉన్న అంశాల ఆధారంగా ప్రకటనలను నియంత్రించవచ్చు. ఉదాహరణకు, మీకు పాప్ సంగీతమంటే ఇష్టమని Googleకి చెప్పడానికి మీరు ప్రకటనల వ్యక్తిగతీకరణ సెట్టింగ్‌లను ఉపయోగిస్తే, మీరు YouTubeకి సైన్ ఇన్ చేసినప్పుడు మీకు సమీపంలో జరిగే రాబోవు విడుదలలు మరియు కార్యక్రమాల కోసం ప్రకటనలను చూడవచ్చు.

మీరు సైన్ ఇన్ చేసి ఉన్నప్పుడు ప్రకటనల వ్యక్తిగతీకరణను ఆఫ్ చేస్తే, మేము Google సేవలు అలాగే మాతో భాగస్వామ్యం ఏర్పర్చుకున్న వెబ్‌సైట్‌లు మరియు అనువర్తనాల్లో మీ ఆసక్తులకు సంబంధించిన మీ ప్రకటనలను చూపడం ఆపివేస్తాము. మీరు సైన్ అవుట్ చేసి ఉన్నట్లయితే, ప్రకటనల వ్యక్తిగతీకరణను ఆఫ్ చేయడం వలన ప్రకటనలు చూపబడే Google సేవలు మాత్రమే ప్రభావితం అవుతాయి.

ఎగువ మ్యూట్ బటన్‌తో ఆకుపచ్చ రంగు కారు కోసం Google ప్రకటన

మీరు చూడకూడదనుకునే ప్రకటనలను తీసివేయండి

మా భాగస్వామ్య వెబ్‌సైట్‌లు మరియు అనువర్తనాల ద్వారా మేము చూపే అనేక ప్రకటనల్లో ఈ ప్రకటనను మ్యూట్ చేసే సామర్థ్యాన్ని మీకు అందిస్తాము. ప్రకటనలో మూలన ఉండే “X”ని ఎంచుకోవడం ద్వారా, మీకు సందర్భోచితంగా అనిపించని ప్రకటనలను మీరు తీసివేయవచ్చు.

ఉదాహరణకు, మీరు కొత్త కారు కొనడం కోసం మార్కెట్‌లో ఉన్నప్పుడు కారు ప్రకటనలు సహాయకరంగా ఉంటాయి, కానీ కొత్త వాహనాన్ని కొనుగోలు చేసి అందులో సంతోషంగా షికారు చేస్తున్నప్పుడు కారుని ఇప్పుడే కొన్నారు కనుక దాని గురించి Google నుండి మరిన్ని ప్రకటనలను చూడటంపై బహుశా మీకు ఆసక్తి ఉండకపోవచ్చు.

మీరు సైన్ ఇన్ చేసి, మీ ప్రకటనల సెట్టింగ్‌లపై ఆధారపడి ఉంటే, మా భాగస్వామ్యం ఉన్న వెబ్‌సైట్‌లు మరియు అనువర్తనాల్లో మీరు సైన్ ఇన్ చేసిన పరికరాల్లో ఈ నియంత్రణ ప్రభావం చూపుతుంది.

అలాగే మీకు ప్రకటనలు చూపే Google సేవల్లో ఈ ప్రకటనదారుని బ్లాక్ చేయి ఉపయోగించడం ద్వారా మీరు సైన్ ఇన్ చేయకుండానే ప్రకటనలను బ్లాక్ చేయవచ్చు.

ఎగువ కుడివైపున సమాచార బటన్‌తో చలువ కళ్లద్దాల కోసం ప్రకటన

మీకు ప్రకటనలను చూపడానికి మేము ఏ డేటాను ఉపయోగిస్తామో తెలుసుకోండి

మీకు ప్రకటనలు చూపడానికి ఉపయోగిస్తున్న డేటా గురించి మీకు మరింత బాగా అర్థమయ్యేలా చేయడానికి మా సహాయం అందించదలిచాము. ఈ ప్రకటన మీరు నిర్దిష్ట ప్రకటనను ఎందుకు చూస్తున్నారో తెలుసుకోవడం కోసం ప్రాంప్ట్‌ను క్లిక్ చేయడానికి అనుమతించే ఫీచర్‌గా ఎందుకుంది. ఉదాహరణకు, మీరు ఫ్యాషన్ వెబ్‌సైట్‌లను సందర్శిస్తున్నందున మీరు ఒక డ్రెస్ కోసం ఆ ప్రకటనను చూస్తుండవచ్చు. లేదా మీరు రెస్టారెంట్ కోసం ప్రకటనను చూస్తున్నట్లయితే, మీ స్థానం కారణంగా మీరు దాన్ని కనుగొనవచ్చు. ఈ రకమైన డేటా మీకు ఉపయుక్తంగా ఉండవచ్చనే అంశాలకు సంబంధించి మీకు ప్రకటనలను చూపడంలో మాకు సహాయపడుతుంది. కానీ, మేము ఈ డేటాను ప్రకటనదారులతో ఎన్నటికీ భాగస్వామ్యం చేయమని గుర్తుంచుకోండి.